గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:13 IST)

పులిసిన ఇడ్లీలు పెట్టారు.. రోడ్డెక్కిన విద్యార్థులు.. ఎక్కడ?

idli
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పులిసిన ఇడ్లీలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేపట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, మంథని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయంలో విద్యార్థులకు ఉదయం పెట్టాల్సిన ఇడ్లీలను మధ్యాహ్నం వడ్డించారని.. ఇడ్లీలు పులిసిన వాసన రావడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. 
 
అంబేద్కర చౌరస్తాలో నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. హాస్టల్‌ను సందర్శించి ఆహార పదార్థాలను పరిశీలించి.. హాస్టల్ వార్డెన్‌పై ఫైర్ అయ్యారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. 
 
ఈ ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అని శ్రీధర్ బాబు అన్నారు. సంక్షేమ హాస్టల్‌లో మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పడం కాదని.. పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని తెలిపారు.