బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (14:36 IST)

సెప్టెంబర్ 17న విశ్వకర్మ పథకానికి శ్రీకారం.. ప్రధాని ప్రకటన

Modi
Modi
దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలో మరో కొత్త పథకం ప్రారంభించనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. 
 
ఈ పథకం కింద నాయీ బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, ఇతర కుల వృత్తుల వారికి రూ.13వేల కోట్ల నుంచి రూ.15కోట్ల వరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారని ప్రధాన మంత్రి ప్రకటించారు. 
 
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, కళాకారులు, కళా ఉత్పత్తులు, సేవల నాణ్యత, స్థాయిని మరింత మెరుగుపరచడం.. దేశీయ, ప్రపంచ సరఫరా గొలుసుతో వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు చెందిన కార్మికుల ఆర్థిక సాధికారతకు ఈ పథకం సహాయపడుతుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని మోదీ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.