Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జీవన్‌రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్న కార్యకర్త

Written By ఎం
Updated: మంగళవారం, 5 జనవరి 2021 (20:40 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు జీవన్‌రెడ్డి పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్నారు. 
 
కాగా టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్‌ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 
 
కాగా రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయితే ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్‌కే ఎక్కువగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే యోచనలో అధిష్టానం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

అన్నీ చూడండి

ఐటీ దాడులతో తనకెలాంటి సంబంధం లేదు : రకుల్ ప్రీత్ సింగ్

Rakul Singh IT raids :ఐటీ సోదాలపై తప్పుడు వార్తలను ఖండించిన రకుల్ ప్రీత్ సింగ్‌

Kaka Latest Update: బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా.. కాకీ.. కాంబినేషన్ ఎంట్రీ

Balakrishna entry Mysore: దాదా గా బాలక్రిష్ణ ఎంట్రీ - తర్వాత బోయపాటి శీను తో అఖండ 3 ?

Jailer 2 trailer :రజనీకాంత్ చిత్రం జైలర్ 2 ట్రైలర్ చూస్తే జైలర్ 3 కూడా వుంటుందా ?

తర్వాతి కథనం
Show comments