శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (21:34 IST)

అన్నాచెల్లెళ్లమని గదిని అద్దెకు తీసుకున్నారు.. యువతి గొంతు కోసి..

crime
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి గొంతు కోసి చంపిన దుండగుడు ఆపై బంగ్లా పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు ఆ యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. అన్నా చెల్లెళ్లమని చెప్పి హన్మంతు అనే యువకుడు, ఓ యువతి గదిని అద్దెకు తీసుకున్నారు. హన్మంతు అప్పుడప్పుడూ వస్తూ పోతుండగా.. యువతితో పాటు మరో యువకుడు ఉండేవాడు. 
 
శనివారం ఉదయం ఏం జరిగిందో ఏమో కానీ, ప్రేమ్ కుమార్ అనే యువకుడు గదిలోని యువతి గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.