గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (12:23 IST)

కష్టాల్లో కృతిశెట్టి.. మరో బ్రేక్ ఇవ్వనున్న ఉప్పెన టీమ్?

Kriti Shetty
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లతో కష్టపడుతున్న కృతి శెట్టి ప్రస్తుతం శర్వానంద్ విడుదల కాని సినిమా "మనమే"లో నటిస్తోంది. ఇలా ఆఫర్లు లేకుండా ఇబ్బంది పడుతున్న కృతి శెట్టికి మైత్రీ మూవీ మేకర్స్, ఉప్పెన సినిమా నిర్మాత మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఉప్పెన తర్వాత కృతిశెట్టికి మరో బ్రేక్ ఇవ్వబోతున్నారని టాక్. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా ప్రకటించిన సినిమాలో ఉప్పెన గర్ల్‌ని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా తీసుకోవాల్సి వుంది.
 
కానీ ఆమె వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ ప్రొడక్షన్ హౌస్ సినిమాలో నటిస్తున్నందున.. ఈ ఛాన్స్ కాస్త కృతిశెట్టిని వరించిందని టాక్ వస్తోంది. ఒకవేళ కృతి శెట్టి ఈ రవితేజ-మలినేని కాంబో చిత్రం తెరకెక్కితే మళ్లీ కృతి శెట్టి ఫామ్‌లోకి వస్తుందని సమాచారం.