శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 26 జనవరి 2017 (06:27 IST)

సాకారమవుతున్న తెలంగాణ స్వప్నం... ఎనీటైమ్‌ వాటర్‌..!

కేసీఆర్ ఆవేశపరుడు, భావోద్రేకి, భోళా శంకరుడికి ఒక మెట్టు ఎదిగి అడిగినవీ, అడగనివి కూడా వరాలిచ్చేస్తుంటాడు అనే ముద్ర రాజకీయ వర్గాల్లో ఉంది. ఎంత ధైర్యం లేకపోతే ఇంటింటికీ నల్లా నీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగం అని ప్రకటిస్తాడా అంటూ రెండేళ్ల క్రితం

కేసీఆర్ ఆవేశపరుడు, భావోద్రేకి, భోళా శంకరుడికి ఒక మెట్టు ఎదిగి అడిగినవీ, అడగనివి కూడా వరాలిచ్చేస్తుంటాడు అనే ముద్ర రాజకీయ వర్గాల్లో ఉంది. ఎంత ధైర్యం లేకపోతే ఇంటింటికీ నల్లా నీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగం అని ప్రకటిస్తాడా అంటూ రెండేళ్ల క్రితం చాలామంది కనుబొమలు ముడివేశారు. ఈ రెండేళ్లలో తెలంగాణలో స్వర్గం కిందికి దిగి రాలేదు కానీ.. ప్రజలకు సంబంధించి ఒకటొకటిగా సౌకర్యాలను కల్పించటంలో మాత్రం యావద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం పోటీపడుతోంది. 
 
హైదరాబాద్‌లో కరెంటు కోతలు లేని కాలం అంటూ ఒకటి వస్తుందా అని లక్షలాది మంది హైదరాబాదీలు కలకనేవారు. 2014 నుంచి ఆ కల సాకారమైంది. ఊహల్లో కూడా సాద్యం కానిది తెరాస ప్రభుత్వం వాస్తవం చేసి చూపింది. గత రెండున్నరేళ్లుగా రాజధానిలో విద్యుత్ కోతలు లేవు. ఇది ఎలా సాధ్యం అంటే కేవలం కేసీఅర్ అనే మొండిమనిషి సంకల్పం. 
 
దేశంలో ఏ ప్రాంతలో అయినా సరే, ఏ పెద్ద నగరంలో అయినా సరే.. బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. ప్రభుత్వ ఆసుపత్రులు వంటి రద్దీ ప్రదేశాల్లో గుక్కెడు మంచినీళ్లు లభించడం గగనమే. మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేయాలంటే లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.20. ఇంత రేటు పెట్టి నీరు కొనలేక.. దాహార్తితో చాలామంది సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పడనుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ తాగునీటి పంపిణీ వ్యవస్థనే విప్లవీకరించనుంది. దాని తొలి ఫలితం రూపాయికే లీటర్ స్వచ్ఛమైన మంచినీరు..
 
గ్రేటర్‌ పరిధిలో రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. ప్రభుత్వాసుపత్రుల్లో రూ.1కే లీటర్‌ స్వచ్ఛమైన మంచినీరు లభించనుంది. ఏటీఎంల తరహాలో ఎనీటైమ్‌ వాటర్‌ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం గ్రేటర్‌ పరిధిలో 250 ఎనీటైమ్‌ వాటర్‌(ఏటీడబ్ల్యూ) యంత్రాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 
 
వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాల కేటాయింపు, ఇతర అనుమతుల జారీ ప్రక్రియను జీహెచ్‌ఎంసీకి.. ఈ యంత్రాలకవసరమైన నీటిని సమీప పైపు లైన్లు లేదా ట్యాంకర్లతో సరఫరా చేసే బాధ్యతను జలమండలికి అప్పగించారు. ఇప్పటికే జనజల్‌ సంస్థ ప్రయోగాత్మకంగా ఇందిరా పార్క్‌ వద్ద ఏటీడబ్ల్యూ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జోసబ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ కూడా ఈ యంత్రాల ఏర్పాటుకు ముందుకు రావడం విశేషం.
 
ఎనీటైమ్‌ వాటర్‌తో ప్రయోజనాలు ఏమిటనే ప్రశ్నకు సమాధానం ఇది.  ప్రైవేటు సంస్థలు లీటర్‌ బాటిల్‌ నీటిని రూ.20–రూ.25కు విక్రయిస్తుండగా.. రూ.1కే లీటరు స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు. ఒక్కో యంత్రం ద్వారా ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి 500 నుంచి వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చు. కలుషిత తాగునీరు తాగి జనం రోగాల పాలయ్యే దుస్థితి తప్పుతుంది.  దూరప్రాంత ప్రయాణికులు, నిరుపేదలు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు పొందవచ్చు.  
 
ఈ యంత్రాల్లో జియోలైట్‌ మినరల్‌ సాంకేతికత, రివర్స్‌ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్‌ ఫిల్ట్రేషన్‌ ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా ఆనవాళ్లు.. దేహానికి హాని కలిగించే లోహాలను నీటిలో లేకుండా చేసే అవకాశం ఉంటుంది. నీటి వృథాను అరికట్టవచ్చు. కాయిన్‌ వేసిన వెంటనే లీటరు నీరు వచ్చి నల్లా ఆగిపోతుంది. తక్కువ ఖర్చు. సుమారు రూ.50–75 వేల ఖర్చుతో ఈ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చు. ఈ యంత్రాల్లో సహజసిద్ధంగా దొరికే మినరల్స్‌నే వినియోగిస్తున్నందున నీటి నాణ్యతకు భరోసా ఉంటుంది. 

తెలంగాణ స్వప్న సాకారం రూపాయికే లీటర్ నీటిలో ప్రతిఫలిస్తోంది. పాలకులు పరస్పరం పోటీవలసింది ఇలాంటి అంశాల్లో అయితే అది ప్రజలకెంత ఉపయోగకరం కదా..