సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (18:14 IST)

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలైనారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. కడెం మండలంలోని పెద్ద బెళ్లల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం నుండి బోర్ణపల్లి వైపు ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బెళ్లల్ చెరువు వద్ద ఉన్న పిల్ల కాలువలోకి వెళ్లి బోల్తాపడింది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.