ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (09:20 IST)

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - రైతుల ఆందోళన

rain
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, పిడుగులు, ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
గత రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అదేసమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గత రెండు రోజుల్లోనే 5 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. దీనికితోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండంతో ప్రజలు వణికిపోతున్నారు.