ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి 21 మందిని గాయపరిచాయి. ఇందులో చిన్నారులు, గర్భిణి, కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. శనివారం సాయంత్రం ఒక్కసారిగా శునకాలు దాడి చేసి బాలిక యశోద(8)ను కరిచాయి. ఆమెను రిమ్స్‌కు తరలించారు.
ఇంకా గౌతమ్(24), నిర్గున (20), సమీర్ (16), అఫ్రోజ్(2), మహేర్(15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్ (13)లపై దాడి చేసినట్లు పీహెచ్‌సీ వైద్యుడు రాఠోడ్ శ్రీకాంత్ తెలిపారు. గర్భిణి లక్ష్మి(28)ని కూడా కరిచాయి.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు వచ్చిన మద్ది వీరారెడ్డి, సతీష్‌లు కుక్క కాటు బారిన పడ్డారు. పోలీసు స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌పై ఒక కుక్క దాడి చేసింది. ఎస్‌ఐ దుబ్బాక సునీల్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు.