ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (17:34 IST)

ఆసుపత్రి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. "సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం" అని సీఎం వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు తెలిపారు.

 
కాగా శుక్రవారం 11 గంటలకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే బిజీ షెడ్యూల్ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. 

 
శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో కేసీఆర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి వుంది. ఐతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 28న యాదాద్రి దేవాలయం కుంభాభిషేకం జరుగనుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.