మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (13:31 IST)

టచ్ చేసి చూడు.. కేసీఆర్‌ని టచ్ చేసి బతుకుతావా? సీఎం కేసీఆర్ వార్నింగ్

బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటయిలే అని ఊరుకున్నానని, కానీ అవాస్తవాలే విపరీతంగా సోషల్ మీడియాలోనూ.. బయట ప్రచారం చేస్తున్నారని, అందుకే మాట్లాడక తప్పట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. 
 
ఆయన ఆదివారం ప్రగతి భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బండి సంజయ్‌కి బాధ్యత లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు అర్థం లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రానికి కేసీఆర్ అల్టిమేటం జారీచేశారు. ఉత్తర భారతంలో రైతులకు సపోర్ట్‌గా మేమూ పోరాటం చేస్తామని అన్నారు. ఇక కేంద్రానికి చుక్కలేనని.. వారిని నిద్ర పోనివ్వమని అన్నారు.
 
సొల్లు పురాణం ఆపి.. రైతులకు మేలు చేసే పనిచెయ్యాలని అన్నారు. రైతులను గందరగోళానికి గురిచేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తామని, కేసీఆర్ బ్రతికి ఉండగా సంజయ్ ఆటలు సాగవన్నారు. సిల్లీ బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దని అన్నారు. మీరు మా మేడలు వంచడం కాదు.. మీ మేము ఇరుస్తమని అన్నారు.
 
బండి సంజయ్.. నన్ను జైలుకి పంపుతావ అంత ధైర్యం ఉందా? అంత బలుపా? నీకు.. ఎవరు అనుకోని మాట్లాడుతున్నవ్? కేసీఆర్‌ని ముడుతావా..? టచ్ చేసి చూడు.. కేసీఆర్‌ని టచ్ చేసి బతుకుతావా? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.