శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (13:18 IST)

శాంతమ్మ దశదిన కర్మకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో సీఎం ఆయనను పరామర్శించనున్నారు. ఆదివారం ఉదయం జరిగే ఆమె దశదిన కర్మలో సీఎం పాల్గొంటారు. భూత్పూర్‌ రోడ్డులోని శాంతమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.
 
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ అక్టోబర్‌ 29న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉంటున్న ఆమెకు గతనెల 29న రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో ఆమె దవాఖానుకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి కూడా మరణించిన విషయం తెలిసిందే.