మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (18:20 IST)

వేసవిలో వరి వేయనే వేయొద్దు... తేల్చి చెప్పిన తెలంగాణ సర్కారు

వరి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఈ వేసవిలో వరి పంట వేయనే వేయొద్దు అంటూ మరోమారు తేల్చి చెప్పంది. ఇదే అంశంపై మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందన్నారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
కావాలంటే విత్తనాల కోసం వరి పంటను వేసుకోవచ్చన్నారు. అంతేగానీ, ధాన్యాన్ని పండించేందుకు మాత్రం వరి పంటను వేయొద్దని కోరారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వరి కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. అపుడు తెలంగాణ రాష్ట్ర రైతులు వేసవిలో కూడా వరి వేసుకునేలా సహకరిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.