Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ : టీసీఎల్పీని తెరాసలో విలీనం చేయండి...

Updated: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:39 IST)
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఇపుడు మరో గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిపోయారు. అంతేనా వారు ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ కూడా ఇచ్చారు. 
 
అలా తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్సీల్లో సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. వీరంతా స్వామిగౌడ్‌ను కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు లిఖిపూర్వకంగా కూడా లేఖ కూడా ఇచ్చారు. 
 
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతి రెడ్డి, యాదవ రెడ్డి, కొండా మురళీ, రాములు నాయక్ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెరాస ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో వారికి మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ నోటీసులు కూడా జారీ చేశారు. 

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments