ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (13:30 IST)

ఐసీయూలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా పని చేసిన ఈఎస్ఎల్ నరసింహన్ ప్రస్తుత తీవ్ర అనారోగ్యానికిగురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.
 
అయితే, ఐసీయూ వార్డులో నరసింహన్ చికిత్స పొందుతుండటంతో ఆయన్ను దూరంగానే చూసినట్టు సమాచారం. ఆ తర్వాత కేసీఆర్ సతీమణి కూడా మంగళవారం సాయంత్రం ఆస్పత్రికెళ్లి నరసింహన్ సతీమణిని కూడా పరామర్శించారు.