పాప ఏడుస్తుందని చెప్పినా పట్టించుకోలేదు.. వనస్థలిపురంలో దారుణం
హైదరాబాద్ శివారులో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందడం వివాదాస్పదమైంది. దీంతో ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. నాదర్ గుల్‌కి చెందిన స్వప్న అనే మహిళ నాలుగురోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. పాప ఏడుస్తుందని సిబ్బందికి చెప్పగా చూసెళ్లిపోయారే కానీ పట్టించుకోలేదు.
కానీ కొద్దిసేపటి తరవాత పాప ఏడుపు ఆపేసింది. కళ్లు కూడా మూసేసింది. ఆ పాపను పరీక్షించిన వైద్యులు మరణించినట్లు ధ్రువీకరించారు. ఎంతసేపు ఏడ్చినా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ముందే చెబితే మరో ఆస్పత్రికి తీసుకెళ్లే వాళ్లం కదా అని బంధువులు నిలదీశారు. కనీసం డాక్టర్‌లు సమాచారం కూడా ఇవ్వలేదని బంధువులు మండిపడ్డారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పండంటి పాప మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.