Biodata Maker
✕

కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది : హైకోర్టు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (17:23 IST)
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లాలను పెంచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన అధికార పరిధిలోనే వ్యవహరించిందని పేర్కొంటూ ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. 
 
వరంగల్ జిల్లాకు చెందిన రంగు బాలలక్ష్మితో పాటు మరో నలుగురు కలిసి ఈ పిల్‌ను కోర్టులో దాఖలు చేశారు. ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయ విధానంలో, ఏకపక్షంగా విభజించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అనుసరించిన విధానం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ యాక్ట్ 1974, తెలంగాణ డిస్ట్రిక్ట్ రూల్స్ 2016 నిబంధనలకు విరుద్ధంగా ఉందని వాదించారు. ఈ వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారం ఉందని స్పష్టం చేసింది. 
 
కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వెనుక చెడు ఉద్దేశ్యాలు ఉన్నట్టు పిటిషన్లు నిరూపించలేకపోయారని, అలాంటపుడు న్యాయ సమీక్షకు ఆదేశించలేమని ధర్మాసనం అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. 

అన్నీ చూడండి

Prabhas in a police uniform: ప్రభాస్ పోలీస్ యూనిఫాం కథ గురించి చెప్పిన సందీప్ రెడ్డి

Bhogi review : శర్వానంద్ పెట్టిన భోగి మంటలు ఏమయ్యాయి.. భోగి రివ్యూ

అందరినీ ఆకట్టుకునేలా సిద్ధుగాడి లవ్ స్టోరీ వుంటుంది - డైరెక్టర్ రమేష్ బాబు

వెంకటలక్ష్మితో యాడాది కిందట సినిమాను అభినందించిన హీరో తిరువీర్‌

Avatar 4 : అవతార్ 4 సినిమా పై డిస్నీ అధికారిక ప్రకటన- 2029లో రిలీజ్

తర్వాతి కథనం
Show comments