మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జులై 2023 (14:09 IST)

75 యేళ్ల సుధీర్ఘ పోరాటం... 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలే : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

court
ఆదివాసీ ప్రజల 75 యేళ్ల సుధీర్ఘ పోరాటానికి ప్రతిఫలం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ బెంచ్ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం సంచలన తీర్పునిచ్చింది. 
 
అదేసమయంలో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న సీజే ధర్మాసనం ఆదివాసీయేతరుల అప్పీల్‌ను కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఫలితంగా 75 యేళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి ఫలితం దక్కింది. వీరంతా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాటం సాగించి చివరకు విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
కాగా, ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిధిలోని ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి సదరు 23 గ్రామాలు రావంటా ఆదివాసీయేతర రాజకీయ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఎట్టకేలకు ఆదివాసీలకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.