సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 మే 2023 (14:55 IST)

అవినాశ్‌ రెడ్డికి అనుకూలంగా తీర్పు... సునీత మెమోను పట్టించుకోని హైకోర్టు

ys sunitha
వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్.అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అదేసమయంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మెమోను హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్ తెల్లికి సర్జరీ జరగలేదని ఆమె మెమోలో పేర్కొనగా, దాన్ని న్యాయస్థానం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 
 
అవినాశ్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, దీంతో ఆమెను అవినాశ్ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని గత వారం వాదనల సందర్భంగా అవినాశ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పైగా, అవినాశ్‌కు బెయిల్ ఇవ్వాలని, అవినాశ్ తల్లి ఆరోగ్యం విషయంలో తాము తప్పు చెబితే తమపై చర్యలు తీసుకోవచ్చని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సునీత మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదనీ, అవినాశ్‌పై చర్యలు తీసుకోవాలని మెమోలో ఆమె కోరారు. అయితే, ఆ మెమోను హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు కదా, ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. 
 
దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. మరోవైపు, హైకోర్టు ముందస్తు బెయిల్ ఆర్డర్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశంపై తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు.