గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (09:07 IST)

తెలంగాణ మంత్రి హరీష్ రావు హోం క్వారంటైన్

తెలంగాణలో కరోనా సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. మంత్రి హరీశ్‌రావు పీఏకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.

దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను కరోనా వైరస్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు.

అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు, మరోవైపు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.

ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంటన వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు.
 
ఈ విషయం తెలిసిన కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. అటు, యాదాద్రి జడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా.. జూన్ 5న ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. సీఈవోతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు.