శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:48 IST)

కరోనా కట్టడికై ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి: మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లాలో కరోనాకు రెండు సాంకేతిక బృందాలను నియమించామని, వైదులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు బాగా కష్టపడుతున్నారని, నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఆసుపత్రి వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్స్ మంత్రి చేతుల మీదుగా మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికై ప్రజలు ప్రభుత్వ సూచనలను, నిబంధనలను విధిగా పాటించాలని, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.

కాగా హైదరాబాదులో 200 బెడ్స్ కలిగిన రష్ ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్. నవీన్ సామజిక సేవలో భాగంగా తనవంతు సాయంగా సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్స్ అందించడం పట్ల వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ ఓపీ ఏలా ఉంది.? ఏలాంటి కేసులు వస్తున్నాయని, కరోనా విషయమై క్వారంటైన్, ఐసోలేషన్ వార్డు కేసులు ఏలా చూస్తున్నారని వైద్యాధికారులను మంత్రి ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మెడికల్ కళశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, డీఏంహెచ్ఓ మనోహర్, వైద్యాధికారి కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
తాత్కాలిక రైతు బజారు ఆకస్మిక పరిశీలన
కరోనా నేపథ్యంలో ఏర్పాటైన తాత్కాలిక రైతు మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును మంగళవారం ఉదయం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కూరగాయల విక్రయాలు జరిపే రైతులతో కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయని, తాత్కాలిక మార్కెట్లో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు మార్కెట్లో.. సౌలత్ లు మంచిగుంది సార్ అంటూ ఇబ్బందులేమీ లేవని కూరగాయల రైతులు మంత్రికి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.