గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర నూతన అసెంబ్లీ ప్రారంభం

telangana assembly
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కొత్త భవనం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సుమారుగా 2500 మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ముందుగా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం అసెంబ్లీని ప్రారంభిస్తారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత తొలుత సీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీనులవుతారు. 
 
ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో, సచివాలయ సిబ్బంది తమ చాంబర్లలో కూర్చుంటారు. ప్రారంభానికి దాదాపుగా 2500 మందిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు ఉన్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఛైర్మన్లు, ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ విదేశీ అతిథుదులు, ప్రముఖులను మాత్రమే అనుమతిస్తారు. 
 
వృద్దులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ బగ్గీలను ఉపయోగిస్తారు. సచివాలయంలోకి ప్రైవేటు వాహనాలను అనుమతించరు. కాగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య అసెంబ్లీని చూసేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తారు.