ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (13:26 IST)

సిద్ధిపేటలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఆలయం

Siddhipeta
Siddhipeta
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటుంది. సిద్ధిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మాణం జరుగుతోంది. 
 
మొత్తం 3800 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని రోబో సాయంతో మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో శివుడు, పార్వతి, వినాయకుడి గుర్భగుడులు ఉంటాయి. ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి. 
Temple
Temple
 
రోబోలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. కాగా, ఈ ఆలయం ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనని కంపెనీ ఎండీ జీడీపల్లి హరికృష్ణ మీడియాకు తెలిపారు.