శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (15:43 IST)

నగ్నంగా పడి వున్న మహిళ మృతదేహం

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ తాండూరు మండలంలో దారుణం జరిగింది. మండలం లోని గౌతాపూర్ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ మహిళ మృతదేహం నగ్నంగా పడి వుండటాన్ని ఈ ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.