బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (12:28 IST)

పాల ప్యాకెట్ తెస్తానని వెళ్లి ప్రియుడితో కలిసి, తెల్లారగానే చావు కబురు

పాల ప్యాకెట్ తెస్తానని చెప్పి వెళ్లిన యువతి అర్థరాత్రి వరకూ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే తెల్లవారేసరికి తమ కుమార్తె చనిపోయిందంటూ సమాచారం వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ చదువుతున్న యువకుడు ఒంగోలు లోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందును ప్రేమించాడు. ఇద్దరూ ఒకరికొకరు విడిచిపెట్టలేని స్థితికి వచ్చేశారు. ఐతే ఈ వ్యవహారం పెద్దలకు తెలిసిందే ఏమోగానీ ఈ జంట దారుణ నిర్ణయం తీసుకున్నారు.
 
సోమవారం రాత్రి ప్రియుడి ఆమెకి ఫోన్ చేసాడు. ఇపుడే పాల ప్యాకెట్ తీసుకువస్తానని చెప్పి ఆ యువతి ప్రియుడి వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి సూరారెడ్డిపాలెం రైల్వే ట్రాక్ పైన పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఆ వైపుగా వెళ్లిన స్థానికులు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిచెందిన వారు ఇందు, విష్ణుగా గుర్తించారు. మృతదేహ భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.