సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (12:43 IST)

పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని మందలించిన తల్లి... పురుగుల మందుతాగి.. .

పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని తల్లి మందలించింది. దీంతో ఆ మహిళ మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన విజయవాడ ఆగిరిపల్లి వద్ద జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగిరిపల్లి గ్రామానికి చెందిన రమ్య (25) అనే యువతికి మేనమామ కుమారుడితో వివాహమైంది. యేడాది నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. రమ్య నర్సుగా పనిచేస్తోంది. 

ఈ క్రమంలో ఆదివారం ఉదయం రమ్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి వద్దని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన రమ్య పొలానికి వెళ్లి అక్కడ ఉన్న కలుపు మందు తాగింది. 

గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై పి.కిషోర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.