సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (09:14 IST)

తెలుగు రాష్ట్రంలో రుద్రాక్షలు పండిస్తున్న మాజీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రుద్రాక్షలు పండించే పనిలో బిజీ అయిపోయారు. ఎందుకో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ వివరాలేంటో చూద్దాం రండి..
 
మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని విమలా దేవి వ్యవసాయ క్షేత్రంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అరుదైన మొక్కల్ని పెంచుతున్నారు. ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ దేశంలో పండే రుద్రాక్ష పండుతోంది. పదేళ్ల కింద నాటిన రుద్రాక్ష మొక్కకు సంవత్సరానికి  పది కిలోల రుద్రాక్షలు కాస్తున్నాయి.

నేపాల్ లో సైతం చాలా తక్కువగా కాసే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కేరళలో పండే దాల్చిన చెక్క మొక్క ఏపుగా పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో పండే లిచీ చెట్టుకు ఏడాదికి పదిహేను కిలోల వరకు లిచీ పండ్లు కాస్తున్నాయి. 

ఇక లవంగాలు...ఇలాచీ...బిర్యానీ ఆకు...డ్రాగన్ ఫ్రూట్...ఆవకాడ...స్టార్ ఫ్రూట్ లాంటి అరుదైన మొక్కల్ని పండిస్తున్నారు. దేశంలో పండే 73 రకాల మామిడి పండ్లను నాటి తెలంగాణ భూముల్లో అన్ని చెట్లను నాటి పంటను తీయొచ్చని కాట్రగడ్డ ప్రసూన నిరూపిస్తున్నారు.