బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:33 IST)

ఇప్పుడేమో గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు: కేటీఆర్

తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున్నారు. టీ- కాంగ్రెస్, టీ- బీజేపీ.. కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 
 
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్య‌మా అని ప‌ద‌వులు రాగానే.. గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు అని ఎద్దెవా చేశారు. చిల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. వ‌య‌సులో మీ కంటే 20 ఏండ్ల పెద్ద మ‌నిషిని ప‌ట్టుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్ల‌ర‌గాళ్లు ఎగిరెగిరి ప‌డుతున్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ.. చేసేవి మాత్రం చిల్ల‌ర ప‌నులు అని ధ్వ‌జ‌మెత్తారు.