సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (10:20 IST)

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం

deadbody
తెలంగాణ రాష్ట్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి సబితా రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తన గన్‌మెన్ ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ నగరంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, మంత్రికి భద్రతగా ఉన్న గన్‌మెన్లలో ఫాజిల్ తుపాకీతో కాల్చుకుని చనిపోవడం ఇపుడు కలకలం రేపుతుంది. అలాగే, ఈ ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా పరిశీలించారు. ఫాజిల్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడితో మాట్లాడిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.