Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 1 మార్చి 2022 (13:32 IST)
ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా స్వదేశానికి వస్తున్న బాధితుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను నడుపుతుంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే విద్యార్థులు వారివారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. 
 
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎంబీబీఎస్, జేబీఎస్‌కు చేరుకున్న విద్యార్థులు గానీ, మార్గమధ్యంలోని ఎక్కివారు గానీ ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. అయితే, తాము ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టుగా తగిన ఆధారం చూపించాల్సివుంటుందని టీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఉక్రెయిన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత పౌరులు, విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రొమేనియా వంటి దేశాల రాజధానుల నుంచి ఈ విమానాలను నడుపేలా కేంద్రం చర్యలు తీసుకుంది. 

అన్నీ చూడండి

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

Kamal Haasan: కమల్ హాసన్ లుక్ టెస్ట్‌ పూర్తి - త్వరలో షూటింగ్

Taapsee Pannu: కొన్ని కథలు సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయ్.. అందుకే రిటైర్ మెంట్ బెటర్ : తాప్సీ

తర్వాతి కథనం
Show comments