గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (17:28 IST)

ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మావోయిస్టులు హతం.. ఎక్కడ?

తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం కర్రెగుట్టల సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ పోలీసులు కూంబీంగ్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
 
కాగా గత మూడు నెలల క్రితం కూడా ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేకులగూడెం- చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.