మూల వాగుపై వంతెన మళ్లీ కూలింది...

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలింది. 
 
గతంలో ఓసారి వరద దాటికి కొట్టుకుపోయినా తాజాగా నిర్మాణ పనులు చేపట్టారు. అయితే తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన మళ్లీ కొట్టుకుపోవటంతో నాణ్యతపై అనుమానాలొస్తున్నాయి. కమిషన్ల కక్కుర్తికి ఇదే సాక్ష్యం అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
 
ఈ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేములవాడలో రాజరాజేశ్వరస్వామి భక్తులకు గుడికి వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు దారులుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 28 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు సంవత్సరాల క్రితం ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. 
 
కానీ పనులు నత్తనడక సాగుతుండటం, వర్షాకాలంలో వాగు ప్రవహించటంతో పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇపుడు నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలడంతో ఈ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. 

అన్నీ చూడండి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్‌ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !

Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్

Samantha: సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్న సమంత

డా. శివరాజ్‌కుమార్‌, డాలీ ధనంజయ చిత్రం 666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌ టీజర్‌

తర్వాతి కథనం
Show comments