Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లర్ సంజయ్ .. గొర్రెకుంట బావి హత్యలు 9 కాదు.. 10

Written By ఠాగూర్
Updated: సోమవారం, 25 మే 2020 (18:13 IST)
వరంగల్ శివారు గీసుకొండ ప్రాంతంలోని గొర్రెకుంట బావిలో ఏకంగా 9 మృతదేహాలు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. 
 
అతని కిరాతక చర్యకు మక్సూద్ కుటుంబంతో పాటు బీహార్ కార్మికులు కూడా హత్యకు గురయ్యారు. నిందితుడు సంజయ్ కొన్నినెలల క్రితం మక్సూద్ కుటుంబానికి చెందిన మహిళను నిడదవోలు సమీపంలో రైలు నుంచి తోసేసి అంతమొందించాడు. ఈ విషయంలో తనను మక్సూద్ కుటుంబం నిలదీయడంతో పథకం ప్రకారం వారిని కూడా హతమార్చాడు.
 
శీతలపానీయంలో నిద్ర మాత్రలు కలిపి వారు స్పృహకోల్పోయాక గోనె సంచిలో కుక్కి ఒక్కొక్కరిని బావిలో పడేశాడు. కేవలం ఒక హత్య 9 హత్యలకు దారితీసిందన్న భయంకర వాస్తవం పోలీసులను సైతం నివ్వెరపరిచింది. బీహార్‌కు చెందిన సంజయ్ ఇంటర్నెట్‌లో వెతికి మరీ మర్డర్ ప్లాన్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
ఇదిలావుండగా, హత్యలు చేసినట్లు బిహార్ యువకుడు సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించాడు. మొత్తం 9 మందిని హతమార్చాడు. వరంగల్ పోలీసులు కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 
 
గొర్రెకుంట బావి ఘటన మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రామన్నపేట పోతన మందిరం వద్ద శ్మశానవాటికలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద శ్మశానంలో మక్సూద్, కుటుంబసభ్యుల అంత్యక్రియలు చేయనున్నారు. 

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments