బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:54 IST)

ఆ ఉల్లి మాకొద్దు: తెలంగాణ ప్రభుత్వం

కరోనా వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అన్ని మార్గాలను మూసేస్తుంది. ఇందులో భాగంగా ఉల్లి దిగుమతిని సైతం నిలిపేసింది.

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుండి వచ్చే ఉల్లిని నిలిపివేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లి మార్కెటైన మలక్‌పేట మార్కెట్‌లోకి ఇతర రాష్ట్రాల సరుకును అనుమతించవద్దని మార్కెట్‌ సెక్రటరీకీ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి.

తెలంగాణలో ప్రజల అవసరాలకు తగినంత ఉల్లి ఉత్పత్తి అవుతోందని, ఆ ఉల్లినే రైతుల వద్దనుంచి సేకరించనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ఉల్లి సాగు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.