బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (10:02 IST)

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

pushpa shooting
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'పుష్ప'. రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ ఘన విజయంతో అల్లు అర్జున్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒక్కసారిగా ఐకాన్ స్టార్ అయిపోయారు. వచ్చే నెల 5వ తేదీన ఈ చిత్రం రెండో భాగం విడుదలకానుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 
 
ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించారు. పుష్పకు సంబంధించిన చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నారు. ఈ మేరకు చిత్రీకరణకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోను కూడా పంచుకున్నారు. 
 
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ వర్క్ పూర్తికావాల్సివుంది. త్వరలోనే ఫైనల్ కాపీ వస్తే సెన్సార్‌కు పంపించనున్నారు. పుష్ప-2 చిత్రాన్ని ఆరు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఆంగ్లం భాషల్లో చేస్తున్నారు.