గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (17:16 IST)

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

Ambati Rambabu
Ambati Rambabu
వైకాపా నేత అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల గురించి అంబటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉందని.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలనుకోవడం అవివేకం అని అంబటి తెలిపారు.
 
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేసులు దుమారం కొనసాగుతోందని.. వైసీపీ చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఐటి యాక్ట్ కింద పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు.. టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడకుండా ఎవరూ ఆపలేరని.. అరచేతిని అడ్డు పెట్టి ఆ సినిమాను ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు.
 
స్పీకరైనా, మంత్రైనా.. సామాన్యుడైనా చట్టం దృష్టిలో ఒకటే అని చెప్పారు.  జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోందని, అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్ బుక్ లోకేష్ రాశాడని, అదే అతనికి శాపంగా మారుతుందని అంబటి రాంబాబు చెప్పారు. రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడని అంబటి ఎద్దేవా చేశారు.