బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 12 నవంబరు 2018 (18:59 IST)

ఒక్క ఫోన్ కాల్‌తో ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది...?

సాఫీగా సాగిపోతున్న ఒక యువకుడి జీవితంలోకి ప్రవేశించిన యువతి అతని జీవితంతో ఆడుకుంది. తన స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ నగరంలో సంఘటన జరిగింది. హైదరాబాద్ కాటేథాన్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఒక గుర్తు తెలియని యువతి ఉన్నట్లుండి ఫోన్ చేసి శైలు ఉందా అండి అంటూ అమాయకంగా అడిగింది. 
 
గతంలో శైలు ఈ నెంబర్ తనకు ఇచ్చిందని, తన చిన్ననాటి స్నేహితురాలు శైలు అని చెప్పింది. అయితే ప్రదీప్ శైలు ఎవరో తనకు తెలియదని చెప్పాడు. మళ్ళీ వారం రోజుల తరువాత ఫోన్ చేసి శైలు నెంబర్ తెలిస్తే ఇవ్వమని చెప్పింది. తను ఫోన్ చేస్తే ఖచ్చితంగా నీకు నెంబర్ ఇస్తానని చెప్పాడు ప్రదీప్. నీ పేరేంటని అడిగాడు. అయితే తన పేరు చెప్పలేదు ఫోన్ చేసిన యువతి. 
 
మరో నాలుగు రోజుల పాటు మళ్ళీ ఫోన్ చేసింది. అంతకు ముందు రోజే శైలు ప్రదీప్‌కు ఫోన్ చేసి తన కోసం ఎవరన్నా ఫోన్ చేస్తే ఆ నెంబర్ సేవ్ చేసి ఇవ్వమని చెప్పింది. అయితే మొదట్లో ఫోన్ చేసిన యువతి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తుండటంతో నెంబర్ తెలియక ఇబ్బంది పడ్డాడు ప్రదీప్. మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేయడంతో ఇంటికి రమ్మన్నాడు. అయితే తాను కూడా కాటేథాన్ ప్రాంతంలోనే ఉంటానని, బేకరిలో కలుద్దామని చెప్పింది యువతి. దీంతో ఇద్దరూ బేకరీలో కలిశారు. యువతి పేరు అడిగాడు ప్రదీప్. క్రిష్ణవేణి అని చెప్పింది. ఒకరికొకరు పరిచయం... ఆ తర్వాత కొన్నిరోజులకే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. శైలు ఎవరనేది పక్కన పెట్టేశారు. 
 
ప్రదీప్ - క్రిష్ణవేణిలు చట్టాపట్టాలేసుకుని తిరగడం స్థానికంగా ఉన్న కాటేథాన్ జనం చూశారు. అయితే ఉన్నట్లుండి ప్రదీప్ హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసులు నిందితుల కోసం వెతికారు. ప్రదీప్ ఫోన్‌లో క్రిష్ణవేణి ఫోటోలు చూసి ఆమెను పిలిచి విచారించారు. మొదట్లో తనకేం తెలియదని బుకాయించింది క్రిష్ణవేణి. ఆ తరువాత అసలు విషయాన్ని చెప్పింది. క్రిష్ణవేణి నాన్నకు రమేష్‌ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 10 లక్షలు ఇవ్వాలని, ఆ డబ్బు ఇవ్వాలంటే ప్రదీప్‌తో స్నేహం చేసి అతను ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పాలని బెదిరించాడు. రమేష్‌‌కు ప్రదీప్‌కు మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవ ఉండేది. 
 
తమకు 10 లక్షల రావాలంటే ప్రదీప్‌ను ప్రేమించక తప్పదని భావించిన క్రిష్ణవేణి అతన్ని మెల్లగా ప్రేమలో దింపి రమేష్ పన్నాగం పన్నిన చోటకు తీసుకెళ్లి వదిలేసింది. దాంతో ప్రదీప్‌తో లావాదేవీలున్న రమేష్‌ అతన్ని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ విషయం తెలుసుకున్న క్రిష్ణవేణి భయపడిపోయింది. పోలీసులకు మొదట్లో నిజం చెప్పని క్రిష్ణవేణి ఆ తరువాత జరిగింతా చెప్పేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.