శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:17 IST)

59 యేళ్ళలోపు రైతులు చనిపోవాలా? సీఎం కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న

రాష్ట్రంలో రైతు భీమా పథకం అమలుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, రైతు భీమా పథకంలో లబ్ధి పొందేందుకు 59 ఏళ్లు పైబడిన రైతులను చేర్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు.
 
రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉన్నారని, అయితే రైతు భీమా పథకానికి కేవలం 41 లక్షల మంది రైతులు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 59 ఏళ్లు పైబడిన రైతులకు ఈ బీమాను వర్తింపజేయడం లేదన్నారు. అంటే 59 యేళ్లలోపే రైతులు చనిపావ చనిపోవాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. పైగా, బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
 
బంగారు తెలంణాను సాధించామని, ఇక బంగారు భారతదేశాన్ని సాధిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదని, బానిసత్వపు తెలంగాణ అంటూ ధ్వజమెత్తారు.