గోపాల.. గోపాల చిత్రం బయ్యర్లకు నష్టం తెచ్చిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం 'గోపాల గోపాల'. ఈ చిత్రం విడుదల రోజునే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, కలెక్షన్ల పరంగా బయ్యర్లకు నష్టం తెచ్చిపెట్టిందనే చర్చ ఫిల్మ్ నగర్లో సాగుతోంది.
వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి పండగకు విడుదలైంది. ఈ తర్వాత 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అయితే, నైజాం, సీడెడ్‌లో భారీగా నష్టపోయినట్టు సమాచారం. అసలు ఆ సినిమా టైమ్‌లో కళ్యాణరామ్ 'పటాస్' వచ్చివుంటే 'గోపాల గోపాల' కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపేదనే వారు కూడా లేకపోలేదు.
అలాగే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఊరిస్తూ వచ్చిన శంకర్ 'ఐ' సినిమా రేంజ్ చేరుకోలేకపోయింది. తెలుగులో కొన్న సూపర్‌గుడ్ చాలా నష్టపోయింది. అనుకున్నట్లుగా రాలేదని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. రూ.30 కోట్లు తెలుగులో హక్కులు చెప్పినప్పుడే చాలా మంది దూరం జరిగాయి. కానీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుని విడుదల చేసింది.