పెళ్లి పీటలెక్కనున్న అంజలి... నిజమేనా? (video)
దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను కలిగివుంది. అయితే, ఈ ముద్దుగుమ్మ గతంలో కోలీవుడ్ యువ హీరోతో ప్రేమలోపడింది. ఆ తర్వాత లవ్ బ్రేకప్ అయింది. పిమ్మట తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాతతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఆమె కొన్ని రోజులు పాటు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. ఇటీవల పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు.. అంజలికి వివాహం చేసేందుకు ఆమె బంధువులు ఓ నిర్ణయానికి వచ్చి మంచి వరుడిని చూసినట్టు సమాచారం. ఆ కుర్రోడు కూడా తెలుగు యువకుడనే ప్రచారం సాగుతోంది. వీరి వివాహం కూడా తెలుగు సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్టు వినికిడి. అయితే, ఈ వార్తలను అంజలి లేదా ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు, అంజలి హీరో రామ్ చరణ్ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.