సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 జనవరి 2018 (19:06 IST)

దిల్ రాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అంజలి

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు భారీ విజయాలతో బాగా డబ్బులు సంపాదిస్తున్న నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది దిల్ రాజు ఒక్కరే. ఇప్పటికే వరుస హిట్లతోనే పెట్టిన పెట్టుబడి కన్నా మూడు, నాలుగింత ఎక్కువ డబ్బును సంపాదించేస్తున్నారు దిల్ రాజు. తెలుగు సినీపరిశ్రమలో అగ

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు భారీ విజయాలతో బాగా డబ్బులు సంపాదిస్తున్న నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది దిల్ రాజు ఒక్కరే. ఇప్పటికే వరుస హిట్లతోనే పెట్టిన పెట్టుబడి కన్నా మూడు, నాలుగింత ఎక్కువ డబ్బును సంపాదించేస్తున్నారు దిల్ రాజు. తెలుగు సినీపరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఇప్పుడు దిల్ రాజు ఒకరు. అయితే ఆయన తన సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఎవరు పెట్టాలన్న విషయాన్ని ఆయనే నిర్ణయిస్తారు. ఒకవేళ టాప్ డైరెక్టర్ అయితే మాత్రం వారికే ఆ బాధ్యతను అప్పజెప్పేస్తారు.
 
కానీ గతంలో దిల్ రాజు తీసిన సినిమాల్లో చాలామంది హీరో హీరోయిన్లు ఆయన చెప్పినవారే. దీంతో అవకాశాల్లేని హీరోయిన్లు, హీరోలు ఇప్పుడు దిల్ రాజు వెంట పడ్డారు. అందులో నటి అంజలి ఒకరు. తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది అంజలికి. తమిళంలో అంజలి బిజీగా ఉండడంతో తెలుగులో అవకాశాలు లేవని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, అస్సలు అంజలికి అవకాశం ఇవ్వడానికి ఏ డైరెక్టర్, నిర్మాత ముందుకు రావడం లేదని సినీ విశ్లేషకులే చెబుతున్నారు.
 
అందుకే తెలుగులో అవకాశాల కోసం ఇప్పుడు దిల్ రాజు వెంట పడింది అంజలి. వెంట పడటమే కాదు ఆయనకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా అవసరమైతే గ్లామర్‌గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిందట అంజలి. అయితే అలాంటి క్యారెక్టర్లేమీ ఇంతవరకు తన సినిమాల్లో ప్లాన్ చెయ్యలేదు. ఒకవేళ అలాంటి అవకాశమే వస్తే ఖచ్చితంగా నీకే ఫోన్ చేసి పిలుస్తానంటూ దిల్ రాజు సున్నితంగా అంజలికి చెప్పి పంపేశారట. తెలుగులో అంజలికి హిట్లు బాగానే ఉన్నా అవకాశాలు మాత్రం రాకపోవడంతో ఇలా నిర్మాతలు, దర్శకుల వెంట పడుతోంది నటి అంజలి.