జీఎస్టీని చెల్లించవద్దంటున్న మీరా చోప్రా
కరోనా కష్టకాలంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రతిపక్షాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నటి మీరా చోప్రా కూడా చేరింది. కరోనా రోగులకు వైద్యం అందించలేని కేంద్రానికి 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది.
ఈ కరనా మహమ్మారి సమయంలో ఆమె కేవలం వారం రోజుల్లో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయింది. దీంతో కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆరోపించింది. కరోనా కష్ట కాలంతో పేషెంట్లకు ఆసుపత్రుల్లో బెడ్లు లభించడం లేదని... బెడ్లు దొరికిన వారికి ఆక్సిజన్ దొరకడం లేదని విమర్శించారు.
ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని... అలాంటప్పుడు ప్రజలు 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేనప్పుడు... ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా ఈ జీఎస్టీని చెల్లించవద్దని కోరారు.