మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:11 IST)

ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలనీ... వరుడుని కిడ్నాప్ చేసిన లవర్... ఎక్కడ?

ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ, ఇంట్లోని పెద్దల ఒత్తిడి కారణంగా తన ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. ఈ పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. అంతే.. తన ప్రియురాలిని వివాహమాడనున్న వరుడుని కిడ్నాప్ చేశాడు. కేవలం ఈ పెళ్లి చెడగొట్టాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ పనికిపాల్పడ్డాడు. 
 
ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కింగ్స్ కాలనీకు చెందిన నదీమ్ ఖాన్‌(28)కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అతడు పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెకు కాబోయే భర్త నదీమ్ ఖాన్‌ శనివారం బైక్‌పై వెళ్తుండగా ఆపి కిడ్నాప్‌ చేశాడు. ఆ ప్రేమికుడు కిడ్నాప్‌ చేయడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్‌ అతడితో కుమార్తె ప్రేమాయణం తెలిసే కుటుంబసభ్యులు నదీమ్‌ఖాన్‌తో నిశ్చితార్థం జరిపినట్టు తేలింది. 
 
ఇది తట్టుకోలేకనే ఆ యువకుడు నదీమ్‌ను కిడ్నాప్ చేసినట్టు వెల్లడైంది. అయితే ఈ కిడ్నాప్‌ ఘటనలో అమ్మాయికి ముందుగానే సమాచారం ఉందా లేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.