శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:56 IST)

ఎయిడ్‌ కార్యక్రమం కింద మొదటి బృంద స్టార్టప్స్‌ జాబితాను వెల్లడించిన RICH

రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) యాక్సలరేషన్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ డయాగ్నోస్టిక్స్‌ (ఎయిడ్‌) కార్యక్రమం కింద ఎంపికైన తమ మొట్టమొదటి బృంద స్టార్టప్స్‌ జాబితాను వెల్లడించింది. బహుళ వాటాదారుల భాగస్వామ్యంగా డిజైన్‌ చేయబడిన ఎయిడ్‌ కార్యక్రమం ద్వారా డయాగ్నోస్టిక్స్‌ రంగంలో అత్యుత్తమ స్టార్టప్స్‌ను గుర్తించి, తగిన ప్రోత్సాహం అందించనున్నారు.
 
ఇన్వెస్ట్‌ ఇండియా అంచనాల ప్రకారం భారతదేశంలో మెడికల్‌ డయాగ్నోస్టిక్స్‌ మార్కెట్‌  20.4% సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతూ 32 బిలియన్‌డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అన్ని ఆరోగ్య రంగాలలోనూ  మరిన్ని డయాగ్నోస్టిక్స్‌ రావాల్సిన ఆవశ్యకతను కోవిడ్‌ వేగవంతం చేసింది.
 
రిచ్‌–ఎయిడ్‌ ఇప్పుడు శక్తివంతమైన పర్యావరణ వ్యవస్ధతో కూడిన స్టార్టప్స్‌, ఇన్నోవేటర్లు, ఆస్పత్రులు, క్లినీషియన్లు మరియు మెంటార్లను నిర్మించడం ద్వారా స్టార్టప్స్‌కు తగిన వసతులు పొందేందుకు, యంత్రసామాగ్రి మరియు నైపుణ్యం పొందేందుకు తోడ్పడటాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మెడ్‌ టెక్‌ డొమైన్- యంత్రసామాగ్రి ప్రాప్యత తగినంతగా లేకపోవడం, క్లీనికల్‌ నమూనాలు మరియు పరిశోధనా నైపుణ్యం మొదలు మెంటార్‌షిప్‌ లేకపోవడం మరియు ఔట్‌రీచ్‌లో కష్టాలు వరకూ- స్టార్టప్స్‌ ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన పరిష్కారాలను అందించాలనే ప్రయత్నంతో తీర్చిదిద్దడం జరిగింది.
 
ఈ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ ఇప్పుడు  మరింత తోడ్పాటును ఫార్మాస్యూటికల్‌ ఔట్‌పుట్‌కు సైతం తోడ్పడనుంది. ప్రస్తుతం దేశపు ఫార్మాస్యూటికల్‌ ఔట్‌పుట్‌లో 35%కు హైదరాబాద్‌ తోడ్పాటునందిస్తూ భారతదేశపు ఫార్మా రాజధానిగా వెలుగొందుతుంది. రిచ్‌-ఎయిడ్‌ ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద మెడ్‌ టెక్‌ పార్క్‌ ఉనికిపై ఆధారపడుతుంది. ఈ మెడ్‌ టెక్‌ పార్క్‌లో  భారీ సంఖ్యలో పరిశోధనా సంస్థలు, 15కు పైగా లైఫ్‌ సైన్స్‌ ఇన్‌క్యుబేటర్లు, ఇతర మద్దతు సదుపాయాలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
 
అజిత్‌ రంగ్నేకర్‌, డైరెక్టర్‌ జనరల్‌ (రిచ్‌) మాట్లాడుతూ, ‘‘ డయాగ్నోస్టిక్స్‌లో పరిశోధనలు వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను కోవిడ్‌ 19 మహమ్మారి వెల్లడిచేసింది. దీనిని అనుసరించి ఈ తరహా ఆవిష్కరణలను వేగవంతంగా మార్కెట్‌కు తీసుకువెళ్లే ఆవిష్కరణలూ కావాల్సి ఉంది. ఈ తరహా వైద్య అత్యవసరాలను డీల్‌ చేయడంలో ఇవి మనకు తోడ్పడతాయి. హైదరాబాద్‌లో మనకు ఇప్పటికే పరిశ్రమ, ఆస్పత్రులు, క్లీనిషియన్లు, మెంటార్లతో కూడిన ఫలవంతమైన పర్యావరణ వ్యవస్ధ ఉంది.
 
ఎయిడ్‌ కార్యక్రమంతో, యువ ఆవిష్కర్తలు తమ ఆలోచనలను ఆచరణీయమైన వ్యాపార ప్రతిపాదనలుగా మార్చడానికి ఉత్తమంగా సహాయపడే రీతిలో  ఎయిడ్‌ కార్యక్రమంతో వీటిని తీసుకురాగమని ఆశిస్తున్నాము. ఈ బృందం ఈ తరహా ఎన్నో స్టార్టప్స్‌లో మొట్టమొదటిది. కేవలంహైదరాబాద్‌లో మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా  డయాగ్నోస్టిక్స్‌ రంగంలో సమూలమైన మార్పును తీసుకురావడంలో సహాయపడగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
వాస్తవంగా 28 జనవరి 2021వ తేదీన ప్రకటించిన ఎయిడ్‌ కార్యక్రమం, మెడ్‌ టెక్‌ పర్యావరణ వ్యవస్థ వ్యాప్తంగా  ప్రోత్సాహకరమైన స్పందనను వ్యవస్థాపకులు, స్టార్టప్స్‌ నుంచి అందుకుంది. ఇన్‌ విట్రో డయాగ్నోస్టిక్స్‌ రంగంలో స్టార్టప్స్‌కు అందించిన పిలుపుతో 76 దరఖాస్తులు ఇండియా, కెనడా, యుఎస్‌ఏ, దక్షిణ కొరియా నుంచి వచ్చాయి!
 
ఈ ఎంట్రీలను పలు అంశాలపై నిపుణులు, పరిశ్రమ నాయకులతో కూడిన ప్యానెల్‌ పరిశీలించింది. ఈ నిపుణులలోః
 
డాక్టర్‌ అమన్‌ ఇక్బాల్‌, ఫౌండర్‌ అండ్‌ గ్లోబల్‌ పార్టనర్‌, సీఈవో, వాంటేజ్‌ ఎంటర్‌ప్రైజ్‌
డాక్టర్‌ అంబుజ్‌ చతుర్వేది, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఐకెపీ నాలెడ్జ్‌ పార్క్‌
డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌ మరియు ఫౌండర్‌ అండ్‌ సీఈవో, డైరెక్టర్‌– గ్రేస్‌ (గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ క్యాన్సర్‌ ఎడ్యుకేషన్‌) ఫౌండేషన్‌
డాక్టర్‌ రాధ రంగరాజన్‌, చీఫ్‌ సెంటిఫిక్‌ ఆఫీసర్‌-హెల్త్‌క్యూబ్డ్‌
 
ఎయిడ్‌ ప్రోగ్రామ్‌ కోసం తుది స్టార్టప్స్‌ ఎంపికను పలు అంశాలైనటువంటి సొల్యూషన్‌ యుఎస్‌పీ, టెక్నికల్‌ స్ట్రెంగ్త్‌, యూజబిలిటీ అండ్‌ స్కేలబిలిటీ, రెడీనెస్‌, వాలిడేషన్‌, ఫిట్‌ ఫర్‌ పర్పస్‌, కమర్షియల్‌ రోడ్‌ మ్యాప్‌ వంటి వాటి ఆధారంగా పరిశీలిస్తారు.
 
సంక్షిప్తీకరించబడిన జాబితాలోని స్టార్టప్స్‌, అక్షర క్రమంలో...
ఐడియా హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన ఐడియా హెల్త్‌ సంస్థ చేతితో పట్టుకోతగిన స్మార్ట్‌ డెంటల్‌ ఉపకరణం అభివృద్ధి చేసింది.దీనిద్వారా డెంటల్‌ పల్ప్‌ చాంబర్‌ను విజువలైజ్‌ చేయడంతో పాటుగా కానల్‌ ఓరిఫిసను సైతం రూట్‌ కెనాల్‌ చికిత్సకోసం చూడవచ్చు.
 
ఐకీనిస్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: బెంగళూరు కేంద్రంగా కలిగిన ఐకీనిస్ట్‌ , ఏఐ యాక్సలరేటెడ్‌ ఇమేజింగ్‌ పరిష్కారాలను డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాలు మరియు ఆస్పత్రులకు అందిస్తుంది. దీనియొక్క క్విక్‌ స్కాన్‌ పరిష్కారాలు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సమయాన్ని 2-4 రెట్లు వృద్ధి చేస్తుంది.
 
బ్రియోటా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: పూనె కేంద్రంగా కలిగి బ్రియోటా టెక్నాలజీస్‌, కోవిడ్‌ 19 సేఫ్‌ ఏఐ ఆధారిత స్పైరోమీట్రి ఉపకరణం తయారుచేసింది. శ్వాస సంబంధిత సమస్యలను నిర్థారించడంతో పాటుగా అత్యుత్తమంగా నిర్వహించడమూ వీలవుతుంది.
 
ఎన్రీచ్‌ బయోసైన్సెస్‌ ఐఎన్‌సీ: టొరొంటో  కేంద్రంగా కలిగిన ఎన్రీచ్‌ బయోసైన్సెస్‌ ఏఐ ఆధారిత (ప్యాట్రర్న్‌ గుర్తిస్తుంది)లిక్విడ్‌ బయాప్సీ ఎంఆర్‌డీ టెస్ట్‌ను క్యాన్సర్‌ గుర్తింపు కోసం అందిస్తుంది. రక్తం నుంచి ఇది గుర్తిస్తుంది. అదే సమయంలో  సెన్సిటివిటీ మరియు స్పెసిఫిసిటీ పరంగా రాజీపడదు.
 
హెల్త్‌కాన్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన హెల్త్‌కాన్‌, మెడికల్‌ గ్రేడ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ ఉపకరణాలు ఎంహెల్త్‌ను రియల్‌ టూఐమ్‌ 2 వే కనెక్టివిటీతో ఇంటిగ్రేడ్‌ చేస్తుంది మరియు క్లౌడ్‌ సేవలను ఫుల్‌ స్టాక్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ డెలివరీ ఆవిష్కరణగా కూడా మారుస్తుంది. ఇది రిమోట్‌ మానిటరింగ్‌, కేర్‌ను అందిస్తుంది.
 
మెడ్‌ట్రా ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: కొచి కేంద్రంగా కలిగిన మెడ్‌ట్రా ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యొక్క వీనిన్యుక్స్‌, వీన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ను కనుగొంది. ఇది అగుమెంటెడ్‌ రియాల్టీ వినియోగించుకుని ఇంట్రావీనస్‌ ప్రక్రియలలో  విఫల ప్రయత్నాలను తగ్గిస్తుంది.
 
మెడ్‌జాక్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడ్‌జాక్‌ బహుళ వినియోగ, పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ మరియు పోర్టబల్‌ పరిష్కారాలను విభిన్నమైన ఆక్యులర్‌ వ్యాధులు, ఫీచర్లు మరియు అసాధారణతల నిర్ధారణకు తోడ్పడుతుంది.
 
ఆన్‌వార్డ్‌ అసిస్ట్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన ఆన్‌వార్డ్‌ అసిస్ట్‌ను పాత్‌ అసిస్ట్‌ మాడ్యుల్‌ అభివృద్ధి చేసింది. క్లౌడ్‌ ఆధారిత టెలిపాథాలజీ సాఫ్ట్‌వేర్‌తో ఏఐ ఆధారిత ఇమేజ్‌ విశ్లేషణ ఉపకరణాలతో మిళితం చేసి క్యాన్సర్‌ పాథాలజిస్ట్‌లకు ఆటోమేటెడ్‌ అసిస్టెన్స్‌ అందిస్తుంది.
 
ప్రైమరీ హెల్త్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: గౌహతి కేంద్రంగా కలిగిన ప్రైమరీ హెల్త్‌టెక్‌ నానో టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్‌, మరియు సృజనాత్మక డిజైన్‌ను దీర్ఘకాలిక వ్యాధులను ముందుగా కనుగొనడంలో తోడ్పడుతుంది. నిర్ధిష్టమైన బయోమార్కర్లు సమగ్రమైన ఆరోగ్య నివేదికను మూత్రపిండాలకు సంబంధించి కేవలం కొన్ని రక్తం, మూత్రం చుక్కలతోనే అందిస్తుంది.
 
స్పార్‌కోలైఫ్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన కంపెనీ ప్రస్తుతం, కాంటాక్ట్‌లెస్‌ నాన్‌ ఇన్వాసివ్‌ మల్టీ డైమన్షనల్‌ మల్టీ మోడల్‌ స్ర్కీనింగ మరియు ఎస్సెస్‌మెంట్‌ వ్యవస్థను మెంటల్‌, న్యూరోలాజికల్‌, సబ్‌స్టాన్స్‌ వినియోగ పరిస్థితుల కోసం అందిస్తుంది.
 
ఈ సంక్షిప్తీకరించబడిన స్టార్టప్స్‌ రాబోయే ఆరు నెలల కాలం పాటు అతి ముఖ్యమైన ప్రయోజనాలను అందుకుంటాయి. వీటిలో  ఏఐసీ–సీసీఎంబీ (అటల్‌ ఇన్‌క్యుబేషన్‌ కేంద్రం- సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ) వద్ద ఇన్‌క్యుబేషన్‌ ; భాగస్వామ్య ఆస్పత్రుల వద్ద ప్రాజెక్ట్‌ తేజ్‌ స్కీమ్‌ కింద టెస్ట్‌ బెడ్‌ల ప్రాప్యత ; నమూనాల పరిశీలన, వాలిడేషన్‌ మద్దతు పొందవచ్చు. నిర్థిష్టమైన అవసరాలను అనుసరించి వారు ముఖాముఖి మెంటార్‌షిప్‌ను వారు పరిశ్రమలో అత్యున్నత సాంకేతికత, వ్యాపార నిపుణుల నుంచి పొందవచ్చు. సంభావ్యమదుపరులు, పరిశ్రమ సంస్థలతో సైతం కనెక్ట్‌ కావొచ్చు. విభిన్నమైన నైపుణ్య విభాగాలలో 20 మంది మెంటార్లను రిచ్‌ కలిగి ఉంది. ఈ విభాగాలలో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు, డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వ్యాపార, సాంకేతికత, కార్యకలాపాలు, తయారీ, అమ్మ కాలు, కమ్యూనికేషన్స్‌, రెగ్యులరేటరీ నిపుణులు ఉంటారు. ఈ షార్ట్‌ లిస్టెడ్‌ స్టార్టప్స్‌ ఒక్కోటి రెండు లక్షల రూపాయల యాక్సలరేషన్‌ గ్రాంట్‌ను సైతంఅందుకుంటాయి.
 
రిచ్‌–ఎయిడ్‌ ప్రోగ్రామ్‌ ఖచ్చితంగా ఒక బలమైన, అభివృద్ధి చెందుతున్న లైఫ్‌ సైన్సెస్‌ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి తన ప్రయత్నంలో ఎలాంటి రాజీపడటం లేదు.ఇది దేశీయ మెడ్‌ టెక్‌ స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి, తమ పూర్తి సామర్థ్యం వెల్లడి చేసుకోవడానికి సహాయపడుతుంది. రిచ్-ఎయిడ్‌ ప్రోగ్రామ్‌ తొలి ఎడిషన్‌లోనే 10 ఎంపిక చేయబడ్డ స్టార్టప్స్‌ ఖచ్చితంగా వేగంగా విస్తరిస్తోన్న మెడ్‌ టెక్‌ స్టార్టప్స్‌లో పరిశీలించతగినవి !
 
భారత ప్రభుత్వ (జీఓఐ)  ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఎడ్వైజర్‌ (పీఎస్‌ఏ) మరియు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన  కార్యక్రమం రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) . క్లిష్టమైన స్థానిక అంటే నగర మరియు రాష్ట్ర స్థాయి సమస్యలు పరిష్కరించడానికి విజ్ఞాన ఆధారిత అంశాలను సృష్టించడం రిచ్‌ లక్ష్యం. జాతీయ పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమలు, అసోసియేషన్లు, స్టార్టప్స్‌, సివిల్‌ సొసైటీ సంస్ధలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖలు నడుమ సహకార నెట్‌వర్క్స్‌ సృష్టించడం ద్వారా క్లిష్టమైన సవాళ్లకు తగిన పరిష్కారాలను అందిస్తుంది.