గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (08:20 IST)

భగ్గుమంటున్న పసిడి ధరలు.. బంగారాన్ని తాకితే షాక్ తప్పదు..

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... శనివారం మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. 
 
శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.300 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,000 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.3300 పెరిగింది. దీంతో ఈరోజు రేటు రూ.48,000 కి చేరింది.. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు ఆమాంతం పెరిగింది.
 
దేశీయంగా పరుగులు పెడుతున్న పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గతంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ క్రమ క్రమంగా పరుగులందుకుంటోంది. తాజాగా శనివారం వెండి ధర భారీగా పెరిగింది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పెరుగుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.1500 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.68,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500 ఉంది.
 
అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కేరళలో రూ.68,500 ఉంది. ఇక పుణెలో కిలో వెండి రూ.68,500 ఉండగా, హైదరాబాద్‌లో రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ఇక ఏపీలోని విజయవాడలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విశాఖలో రూ.73,400 వద్ద ఉంది.