శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (16:26 IST)

వివాహ బంధం ఎనిమిది నెలల్లో ముగుస్తుందని అనుకోలేదు.. శ్వేతాబసు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా అడుగుపెట్టిన శ్వేతాబసు ప్రసాద్‌ ఆ తర్వాత కోలీవుడ్‌, టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు వ్యభిచార కేసులో చిక్కుకుని కొంతకాలం జైలు జీవితాన్ని గడిపింది. ఆ సమయంలో తీవ్ర మనోవేదనకు గురైన శ్వేతా బసు.. ఆ సమస్య నుంచి బయటపడింది. ఆ తర్వాత రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని పెళ్ళి చేసుకుంది. కానీ, వీరి వివాహ బంధం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగిసింది. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా శ్వేతా బసు తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. 

ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న ఈమె తన వివాహ బంధంపై స్పందిస్తూ, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశానని, ముఖ్యంగా పెళ్ళి తర్వాత ఇప్పుడే స్వేచ్ఛగా జీవిస్తున్నానని, భర్తతో తెగతెంపులు చేసుకున్న తర్వాతే జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా తన వివాహ జీవితం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయింది. ఏదిఏమైన ప్రస్తుతం జీవితాన్ని హాయిగా గడుపుతున్నట్టు చెప్పారు. అదేసమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలుపెట్టింది.