Festival Posters
✕

అఖిల్ అక్కినేనితో జాన్వీ కపూర్ రొమాన్స్.. ఈ సినిమా అయినా కలిసొస్తుందా?

Written By సెల్వి
Updated: బుధవారం, 3 మే 2023 (12:00 IST)
అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమా అంతగా కలిసిరాలేదు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అఖిల్ నిరాశకు గురైనట్లు సమాచారం. అందం, అభినయం వున్నా సక్సెస్ లేకపోవడం అఖిల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర, బాక్సాఫీస్ వద్ద చిత్రం పేలవమైన ప్రదర్శనకు సంబంధించి క్షమాపణలు చెప్పారు. తాజాగా అఖిల్ అక్కినేనిని సంబంధించిన తాజా అప్డేట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 
 
సాహో టీమ్‌లలో భాగమైన UV క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి అఖిల్ అక్కినేని చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ రాబోయే చిత్రంలో కథానాయికగా నటిస్తుందని ఇంకా ఆమె పేరు ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇది నిజమైతే.. జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలో ఆమె చేసే రెండో సినిమా ఇదే అవుతుంది.
 
నిజానికి, జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం, #NTR30తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

అన్నీ చూడండి

రాప్తాడు నిందితుడు కేసు, కట్ చేసిన అతడి కాలును భద్రపరచండి: హైకోర్టు

గతంలో కర్రీలో బల్లి.. నేడు సాంబారులో నత్త.. ఎక్కడ?

బోయింగ్ విమానం బాడీని కొనుగోలు చేసి ఇంటి వెనుక తోటలో పాతిపెట్టాడు

అస్సాం రైలు ప్రమాదం, పనిచేయని రైలు బ్రేకులు, అందుకే ప్రమాదం, వీడియో

స్థానిక ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలు దివాలా కోరుతనానికి నిదర్శనం : దగ్గుబాటి పురంధేశ్వరి

అన్నీ చూడండి

ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

తర్వాతి కథనం
Show comments