పుష్పతో సంయుక్త.. డైరక్టర్ ఎవరో తెలుసా?
ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది సర్ హీరోయిన్ సంయుక్త. "పుష్ప-2" బన్నీ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
విరూపాక్ష సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. భీమ్లా నాయక్, బింబిసార, సార్ వంటి సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ సంపాదించి పెట్టాయి. తాజాగా త్రివిక్రమ్ చిత్రంలో నటించే బంపర్ ఆఫర్‌ను కైవసం చేసుకుంది.