శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (10:03 IST)

ఎంత చెప్పినా వినలేదు.. అందుకే చెంప పగులకొట్టా.. సంయుక్త మీనన్

SamyukthaMenon
హీరోయిన్ సంయుక్త మీనన్ ఓ వ్యక్తి చెంప ఛెల్లుమనిపించింది. ఎందుకో తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే. విరూపాక్ష హీరోయిన్ అయిన సంయుక్త మీనన్.. ఓ వ్యక్తి చెంపచెల్లుమనిపించింది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
సంయుక్తా మీనన్ వరుస విజయాలతో మంచి జోరు మీదుంది. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె తాజా చిత్రం విరూపాక్ష కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ''ఒకసారి మా అమ్మతో కలిసి బయటకు వెళ్లాను. మేము ఒక చోట నిలబడ్డాము. అక్కడ ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అతను మా మీద పొగ ఊదాడు. అక్కడి నుంచి పక్కకు వెళ్లాలి అనుకున్నాం కానీ వెళ్లేందుకు చోటు లేదు. దాంతో అక్కడే ఆగిపోయాం. మా అమ్మకు అప్పటికే శ్వాస సమస్యలు ఉన్నాయి. దాంతో నేను అతని దగ్గరకు వెళ్లి సిగరెట్ తాగవద్దని అడిగాను. అతను వినలేదు. అంతేకాదు, అతను మాతో అసభ్యంగా మాట్లాడాడు. కోపంతో అతని చెంపల మీద కొట్టాను... అంటూ సంయుక్త వెల్లడించింది. 
 
కాగా సంయుక్త మీనన్ 2016లో పాప్‌కార్న్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది.ఆమె తెలుగులో వరుసగా బింబిసార, సర్, విరూపాక్ష చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ సాధించింది.