మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:57 IST)

అనసూయ రాజకీయాల్లోకి వస్తుందా..? రోజా అలా హామీ ఇచ్చిందా?

యాంకర్ అనసూయ రాజకీయాల్లో వస్తుందంటూ పుకార్లు షికార్లు చేసినా.. అనసూయ మాత్రం వాటిపై స్పందించలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వంటి పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరమని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆమెను పాలిటిక్స్‌లో రమ్మని అడిగినట్టు సమాచారం. 
 
ఇప్పటికే కేంద్రంతో పాటు, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతలు అనసూయతో చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ అనసూయ మాత్రం రాజకీయ ఆరంగేట్రంపై తన సన్నిహితులతో చర్చిస్తోంది. ఇపుడిపుడే రాజకీయాలు అవీ వద్దు అన్నట్టు ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
కానీ కొంత మంది మాత్రం రాజకీయాల్లో వెళ్లినా.. రోజాలా జబర్ధస్త్‌తో పాటు సినిమాలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
 
మరోవైపు రోజా కూడా అనసూయను వైసీపీలో చేరితో మంచి పదవి వచ్చేలా చేయడంలో కృషి చేస్తానంటూ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు ఇపుడిపుడే రాజకీయాలంటే ఒక వర్గానికి పరిమితం అయిపోతామన్న విమర్శలు కూడా వస్తాయి. అందుకే ఇప్పట్లో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనే డైలామాలో అనసూయ ఉన్నట్టు సమాచారం. మొత్తంగా అభిమానుల కోరిక తీర్చేలా అనసూయ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తుందా లేదా అనేది చూడాలి.